ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఝలక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు!
- ఎర్రగొండపాలెం టికెట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు
- బుద్దల అజితారావుకు టికెట్ కేటాయింపు
- బాలినేని సమక్షంలో వైసీపీలో చేరిన డేవిడ్ రాజు
ఎర్రగొండపాలెం టికెట్ ను రాజకీయ సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు బుద్దల అజితారావుకు కేటాయించారు. దీంతో డేవిడ్ రాజుకు చుక్కెదురైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో తిరిగి సొంతగూటికే చేరుకున్నారు.