Narendra Modi: చర్చనీయాంశమైన మోదీ ప్రకటనకు ‘కోడ్’ వర్తించదన్న ఈసీ!

షార్ట్స్‌లో చూడండి
'మిషన్ శక్తి' ఆపరేషన్ పేరిట అంతరిక్షంలో ఓ టార్గెట్ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేసిన ప్రయోగం విజయవంతమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మోదీ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక.

ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు స్పష్టత నిచ్చారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం ఈరోజు జరిగిందని, దేశ రక్షణకు సంబంధించిన అంశాలపై చేసే ప్రకటనలకు ఎన్నికల కోడ్ వర్తించదని చెప్పారు. ఈ తరహా అంశాలపై ప్రకటనలకు ఎలాంటి ముందస్తు అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.  
Go Back to Shorts
Narendra Modi
pm
Mission Shakthi
EC
E-Code

More Telugu News