గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ!
- స్టే విధించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
- అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
- సజావుగా సాగిన నామినేషన్ ప్రక్రియ
ట్రైబ్యునల్ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం స్టే కోరుతూ వేసిన పిటీషన్ ను నిరాకరిస్తూ .. ఆయన నామినేషన్ వేసుకోవచ్చంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సకాలంలో హైకోర్టు తీర్పు రావడంతో గోరంట్ల మాధవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దాంతో అప్పటివరకూ కొనసాగిన సస్పెన్స్ కి తెరపడింది.