ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయి: నటి కల్పిక గణేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయి: నటి కల్పిక గణేశ్

  • ఎవరితో ఎలా వుండాలో తెలియదు 
  • అమాయకత్వం కారణంగా ఇబ్బందులు పడ్డాను 
  • గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాను      
తెలుగు తెరకి 'ప్రయాణం' అనే సినిమా ద్వారా నటిగా 'కల్పిక గణేశ్' పరిచయమైంది. ఆ తరువాత ఆమె కొన్ని సినిమాలతో పాటు యాడ్స్ లోను నటించింది. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " తెలుగు ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టే సమయానికి సినిమాల గురించి నాకు అంతగా తెలియదు. ఎవరితో ఎలా మసలుకోవాలో తెలియదు. నిజ జీవితానికీ .. నట జీవితానికి మధ్య గల తేడా తెలియక ఆరంభంలో కొన్ని అవకాశాలను వదులుకున్నాను.

నా దగ్గరకి ఏ పాత్ర వచ్చినా నేను కథ వింటాను. ఆ పాత్రను గురించి చెబుతున్నప్పుడు ఆ పాత్రలో నేను కనిపిస్తే ఒప్పుకుంటాను .. లేదంటే నో చెప్పేస్తాను. నా అమాయకత్వం కారణంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. ఇస్తామన్న పారితోషికం కూడా ఇవ్వకుండా విసుగు తెప్పించారు. అక్కడి నుంచే నేను గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాను .. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అర్థం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను" అని చెప్పుకొచ్చింది.     
kalpika

More Telugu News