వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ ఎదుటే ఫ్లెక్సీలు చింపి హంగామా సృష్టించిన నేతలు

  • భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు
  • పోలీసుల లాఠీచార్జి
  • సీనియర్ నేత మత్యరాస బాలరాజుకు గాయాలు
వైసీపీ అధినేత జగన్‌కు విశాఖ జిల్లా పాడేరులో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు చింపేసి హంగామా సృష్టించారు. జగన్ సభ జరుగుతుండగానే ఆ పార్టీ సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అనుచరులు, పాడేరు అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు.

దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత మత్యరాస బాలరాజు గాయాలపాలవడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మరో కీలక నేత జి.మాడుగుల ఎంపీపీ మత్యకొండం నాయుడు కూడా భాగ్యలక్ష్మిని ఓడిస్తామని ప్రకటించారు.  
Go Back to Shorts
YSRCP
Jagan
Paderu
Visweswara Raju
Bhagya lakshmi
Balaraju

More Telugu News