జగన్ పాదయాత్ర రికార్డ్ బ్రేకే.. 64 గురువారాలు రెస్ట్, 64 శుక్రవారాలు కోర్టుకు!: బుద్ధా వెంకన్న వ్యంగ్యం

  • ఇలా పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు జగనే
  • అలాంటి రికార్డులెవ్వరూ బద్దలు కొట్టలేరు
  • జగన్ పై ఉన్న కేసులు చూస్తే పులివెందులలో కూడా   ఓటెయ్యరు
వైసీపీ అధినేత జగన్ చేసిన పాదయాత్రపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు విసిరారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేతలు మాట్లాడితే జగన్ పాదయాత్ర గురించి మాట్లాడతారని, వేల కిలోమీటర్లు నడిచారని, ఇంత వరకూ ఎవరూ చేయలేదని గొప్పగా చెబుతుంటారని విమర్శించారు.

‘నిజంగానే, రికార్డు బ్రేక్.. 64 గురువారాలు రెస్ట్ తీసుకున్నాడు. 64 శుక్రవారాలు కోర్టుకి హాజరయ్యాడు. ఇలా పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డే. అలాంటి రికార్డులెవ్వరూ బద్దలు కొట్టలేరు. పాదయాత్రకు ఎక్కడా విరామం ఉండదు. ప్రజల్లోకి వెళుతూనే ఉంటారు’ అని విమర్శించారు. జగన్ పై ఉన్న కేసులు చూస్తే వైసీపీ అభ్యర్థులకే కాదు పులివెందులలో కూడా జగన్ కు ప్రజలు ఓటెయ్యరని అన్నారు.  
Go Back to Shorts
YSRCP
Jagan
Telugudesam
Buddha
Venkanna

More Telugu News