రేపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
- అభ్యర్థుల ఎంపికపై స్పీడు పెంచిన టీఆర్ఎస్
- ప్రగతి భవన్లో కొందరు ఎమ్మెల్యేలతో భేటీ
- ఖమ్మం లోక్సభ స్థానంపై తీవ్ర ఉత్కంఠ
వరంగల్, మెదక్, ఆదిలాబాద్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్ సిట్టింగ్ల విషయంలో ఏ మార్పూ ఉండదని మాత్రం తెలుస్తోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని, మహబూబ్నగర్ స్థానాన్ని పెండింగ్లో పెట్టనున్నట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం లోక్సభ స్థానంపై కూడా తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది.