చంద్రబాబుతో భేటీ కానున్న వంగవీటి రాధా

  • టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటన
  • రూట్‌మ్యాప్‌పై చర్చించనున్న రాధా
  • చంద్రబాబుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం
వైసీపీ అధినేత జగన్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి టీడీపీలోకి ఇటీవలే చేరిన వంగవీటి రాధాకృష్ణ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగనున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు వంగవీటి రాధా కూడా పాల్గొననున్నారు.
Go Back to Shorts
YSRCP
Jagan
Chandrababu
Telugudesam
Vangaveeti Radha Krishna

More Telugu News