'బిగ్ బాస్ 3' హోస్ట్ గా నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 3' హోస్ట్ గా నాగార్జున

  • 'బిగ్ బాస్ 1' హోస్ట్ గా మెప్పించిన ఎన్టీఆర్
  • 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
  •  నాగార్జునతో సంప్రదింపులు      
'బిగ్ బాస్ 3'కి సంబంధించిన సన్నాహాలను 'స్టార్ మా'వారు మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తోంది. 'బిగ్ బాస్ 1'ను హోస్ట్ గా ఎన్టీఆర్ రక్తి కట్టించారు. దాంతో ఎక్కువ మొత్తం పారితోషికాన్ని ఆఫర్ చేసి, 'బిగ్ బాస్ 3'కి కూడా ఆయననే తీసుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించారు. అయితే రాజమౌళి సినిమా కోసం వరుసగా డేట్స్ ఇచ్చేసిన కారణంగా ఎన్టీఆర్ ఈ ఆఫర్ ను తిరస్కరించవలసి వచ్చింది.

దాంతో ఈ రియాలిటీ షో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించినట్టుగా సమాచారం. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నాగార్జున తనదైన స్టైల్లో సమర్ధవంతంగా నడిపించారు. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. అందువలన 'బిగ్ బాస్ 3' హోస్ట్ గా ఆయనని మెప్పించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాలు చేస్తున్నా .. అవి ఆయన సొంత బ్యానర్లోవే కావడం వలన, డేట్స్ సమస్య ఉండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
nagarjuna

More Telugu News