సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆద్యుడు మనోహర్ పారికరే!
- రక్షణ మంత్రిగా అనేక ఘనతలు
- సర్జికల్ దాడులతో సంచలనం
- సౌమ్యుడిగా పార్టీ వర్గాల్లో గుర్తింపు
పొరుగుదేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసేందుకు ఎక్కువగా శ్రమ తీసుకోకుండా కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని పనిముగించింది భారత ఆర్మీ. ఈ దాడులు మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో జరగడంతో ఆయన దూకుడుకు మంచి గుర్తింపే లభించింది. ఈ విషయంలోనే కాదు, భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉంచే విషయంలో కానీ, దేశవ్యాప్తంగా ఉన్న సాయుధ బలగాలకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలోనూ పారికర్ ఎంతో చొరవ చూపారు. అంతేకాదు, రాఫెల్ విమానాలు కొనుగోలు చేసి భారత వాయుసేనను శత్రు దుర్భేద్యం చేయాలన్న ఆలోచన కూడా పారికర్ హయాంలోనే మొదలైంది.