నిద్రమాత్రలు మింగి, మణికట్టు కోసుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్!

  • సునీల్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని జగన్
  • ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో
  • ప్రాణాపాయం తప్పిందన్న వైద్యులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటే తనకెంతో ఇష్టమని, ఆయన తనను పక్కన పెడుతున్నారని, పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా తనకు మరోమారు అవకాశం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ అన్నంతపనీ చేశారు. గత రాత్రి నిద్రమాత్రలు మింగిన ఆయన, ఆపై తన చేతిపై కత్తితో కోసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సునీల్ ను హుటాహుటిన పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే అత్యవసర చికిత్స నిర్వహించిన వైద్యులు, ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందని, ప్రమాదం తప్పినట్టేనని వెల్లడించారు. సునీల్ కుమార్ కు చికిత్స కొనసాగుతోందని అన్నారు.

కాగా, గత వారంలో మూడు రోజుల పాటు తన కుటుంబీకులతో కలిసి లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద వేచి చూసిన సునీల్, ఆయన్ను కలవకుండానే వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆపై తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
Go Back to Shorts
Sunil Kumar
Putalapattu
Jagan
YSRCP

More Telugu News