పవన్ కల్యాణ్ ముందుగా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలి!: కల్వకుంట్ల కవిత డిమాండ్
- జనసేన-బీఎస్పీ పొత్తు రాజకీయ గిమ్మిక్కు మాత్రమే
- చంద్రబాబుతో ఈ కూటమి కలసి వెళుతుందా?
- ప్రజలకు జవాబు చెప్పాలన్న నిజామాబాద్ ఎంపీ
ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ-జనసేన పొత్తు పెట్టుకోవడం రాజకీయ గిమ్మిక్కేనని కవిత స్పష్టం చేశారు. వీరిద్దరూ ఏపీలో చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళతారా? లేక స్వతంత్రంగా పోటీచేస్తారా? అన్న విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, మాయావతి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.