రాజమౌళి సినిమా నాయిక.. ఎవరీ డైసీ ఎడ్గార్ జోన్స్..?

14-03-2019 Thu 14:16 | Entertainment
  • ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా ఎంపిక
  • తారక్ కు జోడీగా రాజమౌళి సెలక్షన్
  • డైసీ వివరాలపై ఆసక్తి!
టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ గురించి రాజమౌళి గురువారం భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా హీరోయిన్ల ఎంపిక గురించి చెబుతూ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తుందని చెప్పాడు. అయితే తారక్ విషయానికొచ్చేసరికి ఓ ఇంగ్లీష్ భామ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆమె పేరు డైసీ ఎడ్గార్ జోన్స్.

భారత ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అయిన జోన్స్ పేరు రాజమౌళి నోటి నుంచి రాగానే ప్రెస్ మీట్లో విస్మయం వ్యక్తమైంది. ఎంతో గొప్ప నటి అయ్యుంటే తప్ప జక్కన్న ప్రత్యేకంగా ఆమెను తీసుకురాడు అని అందరూ ఫిక్సయిపోయారు. ఇక, ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇంతకీ డైసీ ఎవరంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది.

డైసీ ఎడ్గార్ జోన్స్ ఓ బ్రిటీష్ నటి. ఆమె ఇంతకుముందు కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాండ్ లైఫ్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. డైసీ ఓ డ్రామా నటి. బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈ యువనటి ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్ లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత వుడ్ హౌస్ థియేటర్ స్టడీస్ సెంటర్ (వుడ్ హౌస్ డ్రామా కాలేజ్) లో చేరి నటనకు సంబంధించిన కోర్సులు అభ్యసించింది. మరీ అంత గొప్ప పేరు లేకపోయినా రాజమౌళి దృష్టిలో పడడం అంటే డైసీ అదృష్టం అని చెప్పాలి. కొంచెం ఇలియానా పోలికలతో ఉండే డైసీని తెలుగు ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునే అవకాశాలున్నాయి.
TollywoodRajamouliRamcharan

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more