నిన్న రాత్రి నుంచి ఫేస్ బుక్ ఇబ్బందులు... సైబర్ దాడి జరిగినట్టు అనుమానం!

  • కోట్లాదిమంది ఖాతాదారులకు ఇబ్బంది
  • సాంకేతిక సమస్యలే కారణం
  • సమస్యను పరిష్కరిస్తామన్న ఫేస్ బుక్
నిన్న రాత్రి నుంచి ఫేస్ బుక్ ఫ్యామిలీ యాప్స్ ఎప్పటిలాగా ఓపెన్ కావడంలేదు. రాత్రి 9 గంటల నుంచి ఈ సమస్య నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫేస్ బుక్ ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సంస్థ స్పందించింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఫ్యామిలీ యాప్స్ ఓపెన్ చేస్తుంటే సమస్య వస్తోందని అధికారికంగా తెలిపింది. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమంగా ఉన్న ఫేస్ బుక్ పై సైబర్ దాడి జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదయం కూడా ఫేస్ బుక్ వాడకంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.
Go Back to Shorts
Facebook
Cyber Attack

More Telugu News