వైసీపీ సీనియర్ నేతలతో జగన్ అత్యవసర సమావేశం?

  • అందుబాటులో ఉన్న నేతలతో జగన్ సమావేశం
  • ఎన్నికల షెడ్యూల్, రాజకీయ పరిణామాలపై చర్చ 
  • ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడనున్న నేతలు?
ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న నేతలతో ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్టు సమాచారం. అత్యవసర సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడతారని సమాచారం. 
Go Back to Shorts
Hyderabad
lotus pond
YSRCP
Jagan
elections

More Telugu News