తమిళనాడు రాజకీయాల్లోకి గాయకుడు మనో
- టీటీవీ దినకరన్ సమక్షంలో ఏఎంఎంకేలో చేరిన మనో
- మనో అసలు పేరు నాగూర్‌బాబు
- ప్రస్తుతం టీవీ షోలతో మనో బిజీబిజీ
ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, పలు తమిళ చిత్రాల్లోనూ మనో నటించారు. 1985లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంలో తొలి సినిమా పాటను పాడారు. నాగూర్‌బాబుకు మనోగా నామకరణం చేసింది ఇళయరాజానే. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనో రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.