దెబ్బ కొడతా...తోకలు కత్తిరిస్తా అని భయపెడుతున్నది చంద్రబాబే : ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి

  • రివర్స్ లో మట్లాడుతున్నది ఆయనే.. తప్పుచేయకుంటే భయమెందుకు
  • ఐటీ  గ్రిడ్స్‌ సీఈఓను దాచారెందుకో తండ్రీకొడుకులు చెప్పాలి
  • లోకేష్‌ వాస్తవాలు చెబితే వినాలని ఉంది
తోకలు కత్తిరిస్తా, మూలాలపై దెబ్బకొడతా అంటూ శివాలెత్తిపోయి బెదిరిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అదే సమయంలో తనను బెదిరిస్తున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెడుతున్నదీ ఆయనేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

రెండు నాల్కల చంద్రబాబు ఒక్కో నాలికతో ఒక్కోలా మాట్లాడుతున్నారనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌పై ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పలు కామెంట్లు చేశారు. బోగస్‌ ఓటర్లను చేర్పించడం, ప్రతిపక్షానికి అనుకూలురైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కోసం టీడీపీ కాల్‌సెంటర్‌లో 3 వేల మంది ఉద్యోగులు ఫుల్‌టైం పనిచేస్తున్నారని ఆరోపించారు. జయభేరీ సంస్థలు, నారాయణ కళాశాలల్లో ఉన్నవారు వీరికి అదనం అన్నారు.

సేకరించిన సమాచారాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో చెప్పాలన్నారు. డేటా చోరీ కేసులో ఎటువంటి తప్పు చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌ను ఎందుకు దాచిపెట్టారో తండ్రీకొడుకులు తెలియజేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఐటీ గ్రిడ్స్‌పై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి మంత్రి లోకేష్‌ తెరవెనుకకు వెళ్లిపోయి జగన్‌పై ట్వీట్లు చేయిస్తున్నాడని, కానీ డేటా దొంగ అశోక్‌ను ఎందుకు దాచింది మాత్రం చెప్పడం లేదన్నారు.

డేటా కుంభకోణంపై ప్రెస్‌మీట్‌ పెట్టి వాస్తవాలు చెబితే ఐదు కోట్ల మంది ప్రజలు వినాలని కుతూహలపడుతున్నా, ఆ మాత్రం కూడా మంత్రి లోకేష్‌కు చేతకావడం లేదన్నారు. పైగా కులగజ్జి సన్నాసితో ప్రెస్‌మీట్‌ పెట్టించి మొరిగించే స్థాయికి టీడీపీ దిగజారిందని ఘాటుగా విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Vijay Sai Reddy
Twitter

More Telugu News