నా చుట్టూ నలుగురు బలమైన మహిళలు: రాబర్ట్ వాద్రా
- తల్లి, అత్త, భార్య, కుమార్తెలే నా బలం
- మహిళల కలలు నెరవేరాలి
- ఫేస్ బుక్ లో రాబర్ట్ వాద్రా మెసేజ్
ఆపై "ఈడీ విచారణ పూర్తి కాగానే ఇంటికివెళ్లి వారితో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఇప్పటికే 10 రోజుల్లోని 64 గంటల సమయం వృథా అయింది. విచారిస్తున్న వారికి సహకరిస్తున్నా. నిజం నావైపుంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని కూడా అన్నారు. మరో పోస్ట్ లో "ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారంతా విజయం సాధించాలి. వ్యాపార, ఆర్థిక రంగాల్లో, క్రీడల్లో, సైన్స్ లో మహిళలు గెలవాలి" అన్నారు. కాగా, అక్రమాస్తులు, భూ కబ్జాల కేసుల్లో ప్రస్తుతం రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే.