ఐఎస్ఐ, జైషే ఉగ్రబంధంపై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు!
- ఇండియాపై దాడులు చేయించింది నిజమే
- అదే జైషే నన్ను చంపేందుకూ ప్రయత్నించింది
- ప్రత్యేక ఇంటర్వ్యూలో పర్వేజ్ ముషారఫ్
ఇదే సమయంలో అటువంటి ఉగ్ర సంస్థలపై మీ పాలనలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, నాటి పరిస్థితులు చాలా భిన్నమైనవని, అప్పట్లో ఇండియా, పాకిస్థాన్ లు రహస్యంగా పోరాడుతుండేవని అన్నారు. జైషేపై చర్యలు తీసుకోవాలని తాను కూడా ఎటువంటి ఒత్తిడిని తీసుకు రాలేదని చెప్పారు. ముషారఫ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, జైషే మొహమ్మద్ నేత మసూద్ అజర్ ప్రోద్బలంతో గత నెలలో పుల్వామాలో సైనిక పటాలంపై ఆత్మాహుతి దాడి జరుగగా, 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.