చెన్నై వెళుతున్నానని టీడీపీ నేతలకు చెప్పి... జగన్ వద్దకు వచ్చి చేరిన డాక్టర్ ఆదిశేషయ్య!
- ఏపీలో అధికమైన ఫిరాయింపులు
- ఆసక్తికరంగా ఆత్మకూరు రాజకీయం
- ఆనం, మేకపాటి వ్యూహంతో పెరిగిన వైసీపీ బలం
ఆదిశేషయ్యను వదులుకోవడం ఇష్టంలేని టీడీపీ, ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య, స్వయంగా ఆదిశేషయ్యను కలిసి చర్చించి, మీ డిమాండ్లను నెరవేరుస్తామని, పార్టీ మారవద్దని సూచించగా, ఆ సమయంలో తాను చెన్నై వెళ్లాల్సిన పనుందని, వెళ్లి వస్తానని చెప్పి, జగన్ వద్దకు ఆదిశేషయ్య వెళ్లిపోయారు. ఆదిశేషయ్య చేరిక వెనుక మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి తదితరుల వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి వ్యూహంతో ఆత్మకూరులో వైసీపీ బలం మరింతగా పెరిగిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.