నాకు వచ్చిన కలలో నుంచే ఈ కథ పుట్టింది: '118' దర్శకుడు గుహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు వచ్చిన కలలో నుంచే ఈ కథ పుట్టింది: '118' దర్శకుడు గుహన్

  • షూటింగులు ఎక్కడెక్కడో జరుగుతాయి
  •  హోటల్ రూములో ఉండగా కల వచ్చింది
  •  ఆ కల నన్ను వెంటాడుతూ వచ్చింది  
సినిమాటోగ్రాఫర్ గా గుహన్ కి మంచి పేరుంది. కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా వచ్చిన '118' సినిమాకి గుహన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాస్త విభిన్నంగా సాగే ఈ కథ ఎలా పుట్టిందంటూ మీడియా అడిగిన ప్రశ్నకి గుహన్ స్పందించారు.

"సాధారణంగా సినిమా షూటింగులు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. తరచూ కొత్త ప్రదేశాలకి వెళ్లవలసి వస్తుంటుంది .. అక్కడి హోటల్స్ లో ఒంటరిగా నిద్రించవలసి వస్తుంది. అలా ఒక హోటల్లో ఒక్కడినే పడుకున్నప్పుడు ఒక 'కల' వచ్చింది. ఆ కలలో నేను ఒక అమ్మాయిని చంపేశాను. దాంతో ఉలిక్కి పడి నిద్రలేచాను .. అంతే ఆ తరువాత నిద్రపట్టలేదు. అప్పటి నుంచి ఆ 'కల' నన్ను వెంటాడుతూనే వుంది. దాంతో ఆ 'కల'ను కథగా మలచుకున్నాను .. దానిని తెరకెక్కించడానికి ఇంతకాలం పట్టింది" అని ఆయన చెప్పుకొచ్చారు.
guhan

More Telugu News