ఐటీ గ్రిడ్స్ లో సర్వర్లు మాయం.. వెతుకుతున్న తెలంగాణ పోలీసులు

  • నిన్నటి నుంచి కొనసాగుతున్న పోలీసుల సోదాలు
  • గత నెల 27న సర్వర్లు మాయమైనట్టు గుర్తింపు
  • సోదాల్లో పాల్గొంటున్న ఎథికల్ హ్యాకర్లు
హైదరాబాదులోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తెలంగాణ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో బెంగళూరు నుంచి వచ్చిన ఎథికల్ హ్యాకర్లు కూడా పాల్గొంటున్నారు. కీలకమైన మూడు సర్వర్లు మాయమైనట్టు సోదాల్లో గుర్తించారు. ఈ సర్వర్లలోనే కీలకమైన డేటా ఉన్నట్టు చెబుతున్నారు. గత నెల 27న ఈ సర్వర్లు తరలిపోయినట్టు సైబరాబాద్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. 26న కార్యాలయానికి వచ్చిన అశోక్... 27 నుంచి కనిపించకుండా పోయారు. వెళ్లేటప్పుడు మూడు సర్వర్లను కూడా తనతోపాటు అశోక్ తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
Go Back to Shorts
it grids
telangana
police
raids
servers

More Telugu News