దూసుకుపోతోన్న 'అర్జున్ సురవరం' టీజర్

  • న్యూస్ రిపోర్టర్ గా నిఖిల్ 
  • నాయికగా లావణ్య త్రిపాఠి 
  • ఈ నెల 29వ తేదీన విడుదల    
నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' సినిమా నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి 'శివరాత్రి' సందర్భంగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంది.

"ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ .. కానీ ఒక నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడం చాలా కష్టం". "వెతికేవాడు దొరకట్లేదు .. వెతకాల్సినవాడు తెలియట్లేదు"వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఒక న్యూస్ రిపోర్టర్ గా నిఖిల్ నటన ఆకట్టుకునేలా వుంది. నిన్న విడుదలైన ఈ టీజర్ .. చాలా తక్కువ సమయంలో 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టేయడం విశేషం. రాజ్ కుమార్ .. వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నిఖిల్ .. లావణ్య త్రిపాఠికి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Go Back to Shorts
nikhil
lavanya tripathi

More Telugu News