పెళ్లయిన 15 రోజులకే మరదలిపై కన్నేసిన బావ.. కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం!

  • తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
  • గత నెల 15న యువతితో అజిత్ వివాహం
  • మరదలిని ఓ షాపులో బంధించి అత్యాచారం చేసిన అజిత్
పిల్లనిచ్చి పెళ్లిచేసినందుకు ఓ యువకుడు అత్తింటివారికి తీరని వేదనను మిగిల్చాడు. సొంత మరదలిని కిడ్నాప్ చేసి ఓ షాపులో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికను కాపాడారు. తమిళనాడులోని తిరువళ్లూరులో గత నెల చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరువళ్లూరు జిల్లాలోని తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌ (22) ఇక్కడే స్థానికంగా ఓ సెల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత నెల 15న పెళ్లి జరిగింది. ఈ క్రమంలో సొంత మరదలి(13)పై అజిత్ కన్నేశాడు. అయితే ఫిబ్రవరి 27న ఆ బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు యువతిని కిడ్నాప్ చేసిన అజిత్ కుమార్ ఓ షాపులో ఆమెను బంధించి పలుమార్లు తన కామవాంఛను తీర్చుకున్నాడు. అయితే పోలీసుల విచారణలో బాలికను చివరిసారిగా అజిత్ తోనే చూశామని సాక్షులు చెప్పడంతో అధికారులు గత శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం తమదైన శైలిలో విచారించడంతో యువతిని బంధించిన ప్రాంతాన్ని పోలీసులకు చూపాడు. దీంతో ఆమెను రక్షించిన పోలీసులు వైద్య పరీక్షల కోసం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి కటకటాల వెనక్కు నెట్టారు.
Go Back to Shorts
India
Tamilnadu
rape
sister in law
Police
remand
arrest
tiruvalluru

More Telugu News