దశాబ్దం తరువాత ఒకే వేదికపై నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్!
- నేడు పట్నాలో భారీ ర్యాలీ
- పాల్గొననున్న మోదీ, నితీశ్
- 5 లక్షల మందిని తరలించాలని బీజేపీ నిర్ణయం
నవంబర్ 2005లో బీహార్ లో జేడీ (యూ), బీజేపీలు కలిసి ర్యాలీ నిర్వహించగా, ఆపై మరెన్నడూ రెండు పార్టీలూ కలిసి ప్రచారం చేయలేదు. రెండేళ్ల క్రితం ఆర్జేడీకి టాటా చెప్పిన నితీశ్, బీజేపీ సహకారంతో సీఎంగా కొనసాగుతూ వస్తుండగా, మోదీతో కలిసి ఏ బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. ఇక అక్టోబర్ 2013 తరువాత బీహార్ లో నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. గాంధీ మైదాన్ ఈ సభకు వేదిక కానుంది.