రెండు దశాబ్దాల తర్వాత.. సల్మాన్ తో సంజయ్ లీలా భన్సాలీ!
- 'భారత్' షూటింగులో సల్మాన్
- తదుపరి సినిమా సంజయ్ లీలా భన్సాలీ తో
- 20 యేళ్ల తరువాత కుదిరిన కాంబినేషన్
1999లో సల్మాన్ ఖాన్ హీరోగా ఆయన 'హమ్ దిల్ దే చూకే సనమ్' చేసిన సంగతి తెలిసిందే. 20 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతోందన్న మాట. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ 'భారత్' సినిమాలో నటిస్తున్నారు. 'రంజాన్' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో .. ఆ దిశగా పనులు కానిస్తున్నారు. ఈ సినిమా తరువాత సల్మాన్ .. సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లోని సినిమా మొదలవుతుందన్న మాట.