లండన్ లో విజయ్ మాల్యాతో జగన్ రహస్యంగా భేటీ అయ్యారు!: బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణ
- హవాలా డబ్బును తరలించేందుకు జగన్ టూర్
- ఈ భేటీ వివరాలను బయటపెట్టాలి
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
నిన్న చెన్నైలోని ఓ హోటల్ లో వైసీపీ నేతలు జరిపిన రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిధుల కోసమే ఈ సమావేశం జరిగిందని ఆరోపించారు. జగన్ లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారో చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనీ, ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.