రజనీ .. మురుగదాస్ సినిమా ప్రత్యేకత అదేనట!

  • వరుస సినిమాలతో రజనీ 
  • మురుగదాస్ తో సెట్స్ పైకి 
  • పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా      
రజనీకాంత్ ఇకపై రాజకీయాలపైనే పూర్తి దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 'కబాలి' .. 'కాలా' .. 'పేట' సినిమాలను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేసి చకచకా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశారు. అదే ఊపుతో ఆయన మురుగదాస్ సినిమాను కూడా కానిచ్చేలా వున్నారు.

మురుగదాస్ తో రజనీ చేయవలసిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నారనేది తాజా సమాచారం. ఒక పాత్రలో పవర్ఫుల్ ఆఫీసర్ గా ఆయన కనిపిస్తారని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా ముందు కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఆ తరువాత నయనతార పేరు తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడు రజనీకాంత్ చేసేది ద్విపాత్రాభినయం అనే విషయం బయటికి వచ్చింది గనుక, ఇద్దరు కథానాయికలను తీసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
rajani
murugadoss

More Telugu News