కె. విశ్వనాథ్ జీవితచరిత్రగా 'విశ్వదర్శనం' .. టీజర్ రిలీజ్

  • విశ్వనాథ్ హిమాలయాల స్థాయికి ఎదిగారు
  • ఆయన సినిమాలకి భక్తితో వెళతారు
  • ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వి     
తెలుగులో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో కె.విశ్వనాథ్ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. సంగీతం .. సాహిత్యం .. నృత్యం ఆయన కథల్లో కలిసిపోయి కనిపిస్తాయి. మనసు తెరపై అందమైన అనుభూతులను ఆవిష్కరిస్తాయి. అలాంటి కళాతపస్వి జీవితచరిత్రను 'విశ్వదర్శనం' పేరుతో దర్శకుడు జనార్దన మహర్షి తెరపైకి తీసుకొస్తున్నాడు.

ఈ రోజున విశ్వనాథ్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. విశ్వనాథ్ గురించి పలువురు సినీ ప్రముఖుల మనసులోని మాటగా ఈ టీజర్ ను వదిలారు. రాధిక .. భానుప్రియ .. ఆమని .. దర్శకుడిగా విశ్వనాథ్ గొప్పతనం గురించి ప్రస్తావించారు. విశ్వనాథ్ హిమాలయాల స్థాయికి ఎదిగిపోయారని ప్రముఖ గాయని సుశీల అన్నారు. విశ్వనాథ్ సినిమాలకి భక్తితో వెళతారనే అభిప్రాయాన్ని ఎస్పీ శైలజ వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథుడే కళాతపస్విగా అవతరించాడని సిరివెన్నెల చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
vishwanath

More Telugu News