హిట్లు లేకపోయినా భారీ పారితోషికమే తీసుకున్న రకుల్

  • వరుస పరాజయాలు
  • తగ్గిన అవకాశాలు
  • 'రాచ్చసన్' రీమేక్ లోన్ ఛాన్స్  
తెలుగులో రకుల్ అగ్రకథానాయికగా ఎదగడానికి ఎంతోకాలం పట్టలేదు. వరుసగా అగ్రకథానాయకుల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. అయితే 'స్పైడర్' పరాజయం ప్రభావం ఆమె కెరియర్ పై బాగానే పడింది. అక్కడి నుంచే ఆమెకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూనే, తమిళంలో స్టార్ హీరోయిన్స్ జాబితాలో ఎక్కువకాలం ఉండటానికి ట్రై చేస్తోంది.

అయితే రీసెంట్ గా వచ్చిన 'దేవ్' కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' కి ఇది రీమేక్. ఈ మధ్య కాలంలో హిట్లు లేకపోయినా, పారితోషికం విషయంలో ఆమె మెట్టు దిగలేదట. ఎప్పటిమాదిరిగానే ఈ సినిమా కోసం కోటిన్నర పుచ్చుకుందని చెప్పుకుంటున్నారు. గతంలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి 'జయ జానకి నాయక' చేసిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
rakul
bellamkonda

More Telugu News