Rahul Gandhi: రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: ఉత్తమ్

  • రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారు
  • గెలుపోటములు కొత్త కాదు
  • రాహుల్‌ని ప్రధానిని చేస్తాం
ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందని ఉత్తమ్ తెలిపారు. అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని రాహుల్‌ని ప్రధానిని చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ తప్ప.. రాజకీయ ప్రయోజనం ఆశించదని.. గెలుపోటములు కాంగ్రెస్‌కు కొత్త కాదని ఉత్తమ్ తెలిపారు.

More Telugu News

Rahul Gandhi
Uttam Kumar Reddy
Telangana
Congress