నేను పార్టీ మారతానన్న వార్తలు అబద్ధం: తోట త్రిమూర్తులు
- పార్టీ మారాల్సిన అవసరం లేదు
- ప్రజల నిర్ణయమే నా నిర్ణయం
- నాకు అన్ని రాజకీయపార్టీల ఆహ్వానాలు ఉన్నాయి
ఇటీవల టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి మిత్రులని చెప్పారు. అయితే, రాజకీయాలు వేరు, స్నేహం వేరని, ఎవరి రాజకీయ భవిష్యత్ కోసం వారు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. కోటిపల్లి-నరసాపురం వంతెన నిర్మించాలనేదే తన చిరకాల వాంఛ అని, జొన్నాడ-యానాం రహదారి పూర్తి చేయాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. టీడీపీని వీడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పిన తోట త్రిమూర్తులు, తనకు అన్ని రాజకీయపార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయనడం కొసమెరుపు.