నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్న యంగ్ హీరో
- 'అడ్డా' దర్శకుడి నుంచి మరో మూవీ
- పైరసీ నేపథ్యంలో సాగే కథ
- మార్చిలో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి సురేశ్ .. పూజా జవేరి కనిపించనున్నారు. సినిమా పైరసీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాను గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడుకుని ఉంటుంది. ఓ నిర్మాత కూతురికి .. పైరసీ చేసే నాకు మధ్య ప్రేమకథ నడుస్తూ ఉంటుంది. నా తొలి సినిమా పైరసీ జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. పైరసీ చేయడమంటే నిర్మాత సొమ్మును దోచుకోవడమే. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా రూపొందుతోన్న ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది" అని చెప్పాడు.