హైకోర్టులో ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న 30 వేల కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ
- ఆదేశాలు జారీ చేసిన తెంగాణ హైకోర్టు
- కేసుల్లో అప్పీళ్లు, రిట్ పిటిషన్లు తదితరాలు
- రెండు రాష్ట్రాల ఉమ్మడి కేసుల విచారణ హైదరాబాద్లోనే
కోర్టు విభజన అనంతరం కేసుల బదిలీ అధికారాన్ని సుప్రీం కోర్టు తెలంగాణ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కట్టబెట్టడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వంపై ఉన్న రిట్ పిటిషన్లు, అప్పీళ్లు దాదాపు 30 వేలు ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ఇకపై ఈ కేసు విచారణ విజయవాడలోనే జరగనుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి కేసుల విచారణ మాత్రం తెలంగాణ హైకోర్టులోనే విచారణ జరగనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.