ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ
- కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి, కొడుకు కీర్తన్ ల విచారణ
- సుమారు ఆరు గంటల నుంచి కొనసాగుతున్న విచారణ
- వీళ్లిద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్న అధికారులు
స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు మిగిలిన రూ.4.5 కోట్లకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు స్టేట్ మెంట్స్, ఏసీబీ ఇచ్చిన ఆధారాలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. కాగా, సుమారు ఆరు గంటలకు పైగా నరేందర్ రెడ్డి, కీర్తన్ రెడ్డిల విచారణ కొనసాగుతోంది. వీరిద్దరినీ వేర్వేరుగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ చార్జిషీట్ ఆధారంగా నిందితులందరినీ విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.