China: 74 ఏళ్ల కుమార్తెకు ‘లక్కీ మనీ’ ఇచ్చిన 105 సంవత్సరాల తల్లి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో!

అమ్మకు తన పిల్లలపై ఎంతటి ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు. తాజాగా దీన్ని నిరూపించే ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్సులో చోటుచేసుకుంది. లియాంగ్యుంగ్ గాంగ్ ప్రాంతానికి చెందిన ఓ 105 ఏళ్ల పెద్దావిడ తన 74 ఏళ్ల కుమార్తె సంతోషంగా ఉండాలంటూ ఎరుపురంగు సంచిలో నగదును అందించింది. దీన్ని అక్కడ లక్కీ మనీగా పిలుస్తారు. తన తల్లి నగదును ఇవ్వడంతో ఆమె కుమార్తె కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లి ప్రేమంటే ఇదేనని ప్రశంసిస్తున్నారు.
China
mother gives luckey money to daughter
Social Media
Viral Videos

More Telugu News