కల్యాణ్ రామ్ మూవీ నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్
- గుహన్ దర్శకత్వంలో '118'
- డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్
- సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర
"చందమామే చేతికందే .. వెన్నెలేమో మబ్బులోనే .., పూల చెట్టే కళ్లముందే .. పూవులేమో కొమ్మపైనే .., చూస్తూనే ఎంతసేపు .. తాకితేనే ఏంటి తప్పు .. పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం .. రామాంజనేయులు సాహిత్యం .. యాజిన్ నిజర్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.