ప్రేమోన్మాదుల అకృత్యాలు చూస్తుంటే నా సినిమాలోని పాట గుర్తుకొస్తోంది: విజయశాంతి

  • అకృత్యాలపై మొక్కుబడి చర్యలు తీసుకోవద్దు
  • ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి
  • యువతుల ప్రాణాలతో చెలగాటం తగదు
హైదరాబాద్ లో జరిగిన  ప్రేమోన్మాదుల దారుణాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రేమోన్మాదుల అకృత్యాలపై మొక్కుబడి చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘాతుకాలు చూస్తుంటే, తాను నటించిన ‘ప్రతిఘటన’ చిత్రంలోని 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..’ పాట గుర్తుకువస్తోందని అన్నారు. యువతుల ప్రాణాలతో ప్రేమోన్మాదులు చెలగాటమాడటం పరిపాటిగా మారుతోందని, ఈ తరహా ఘటనల కారణంగా వారు మానసికంగా కుంగిపోయే పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.
Go Back to Shorts
Tollywood
t-congress
vijayashanti

More Telugu News