తెలంగాణ కాంగ్రెస్ లో ‘డీసీసీ’ సెగలు.. పార్టీ పదవులకు ఎమ్మెల్యే రేగ రాజీనామా!
- పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మనస్తాపం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఇన్ చార్జి బాధ్యతలకు గుడ్ బై
- డీసీసీ నియామకంపై తనను సంప్రదించలేదని ఆవేదన
ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా తన సొంత ప్రాంతమనీ, అలాంటిది స్థానిక డీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తనతో కనీసం చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డీసీసీ పదవిని కోరితే ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.