జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్

  • కేసు డైరీ మాకు అందింది
  • పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
  • రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారిస్తాం
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి కేసు డైరీ తమకు చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం భార్య పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

ఈ నేపథ్యంలో తమపై పద్మశ్రీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. పద్మశ్రీ ఫిర్యాదు ఆధారంగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌ను నియమించామన్నారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు.  
Go Back to Shorts
Padmasri
Jayaram
Anjani kumar
Telangana
Srinivas
Banjarahills

More Telugu News