అఖిల్ నెక్స్ట్ మూవీకి నిర్మాత నాగ్ కాదట

  • వరుస పరాజయాలతో అఖిల్ 
  • తదుపరి సినిమా సత్య పినిశెట్టితో
  •  వేరే బ్యానర్లో చేసే అవకాశం    
అఖిల్ నుంచి వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా అంతకుముందు ఆయన చేసిన సినిమాల మాదిరిగానే నిరాశ పరిచింది. దాంతో పెద్దగా ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి వెళ్లాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు. ఆయన తదుపరి సినిమాకి సత్య పినిశెట్టి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కథ నాగార్జునకి నచ్చేయడం .. స్క్రిప్ట్ ను ఆయన ఓకే చేసేయడం జరిగిపోయాయనే టాక్ వచ్చింది.

ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. అఖిల్ కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే 'హలో' సినిమాను నాగార్జున నిర్మించారు. అయినా ఆ సినిమా ఆదరణ పొందలేదు. ఇప్పుడు మళ్లీ అఖిల్ సినిమాను సొంత బ్యానర్లో చేస్తే వేరే సంకేతాలు వెళతాయనే ఆలోచనలో నాగార్జున ఉన్నారట. అందువలన వేరే బ్యానర్లోనే అఖిల్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం వుంది.
Go Back to Shorts
akhil
nagarjuna

More Telugu News