ఆమంచి కృష్ణమోహన్ కు చంద్రబాబు, లోకేశ్ ఫోన్.. వైసీపీలో చేరికపై వెనక్కు తగ్గిన టీడీపీ నేత!
- ఈరోజు జగన్ తో భేటీ వాయిదా
- అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశం
- రాయబారం నడిపిన మంత్రి శిద్ధా రాఘవరావు
చంద్రబాబు, లోకేశ్ సముదాయించడంతో మెత్తబడ్డ ఆమంచి ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్ తో జరగాల్సిన భేటీని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తనను కలుసుకోవాలని చంద్రబాబు ఆమంచి కృష్ణమోహన్ కు సూచించారు. దీంతో చీరాల నుంచి ఆయన అమరావతికి బయలుదేరారు. ఈ నెల 13న ప్రకాశం జిల్లాలో జగన్ ‘సమర శంఖారావం’ సభ సందర్భంగా ఆమంచి వైసీపీలో చేరుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.