వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా

  • కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్
  • లోటస్ పాండ్ కు వచ్చిన ఖలీల్ బాషా
  • కండువా కప్పిన జగన్
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్, లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన ఆయన, పార్టీలో చేరారు. ఖలీల్ ను పార్టీలోకి ఆహ్వానించిన జగన్, స్వయంగా వైకాపా కండువాను కప్పారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలిసి జగన్ నివాసానికి వచ్చిన ఆయన, కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఖలీల్ చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయిందని వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Jagan
Kadapa District
Khaleel Basha
YSRCP

More Telugu News