స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం
- ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- గడువు పూర్తికాకుండానే పదవి నుంచి వైదొలగిన సీతా శర్మ
- నిర్వాహక, వ్యవస్థాగత పరిమితులే కారణమని లేఖలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా లేఖను సమర్పించారు. "నిర్వాహక, వ్యవస్థాగత పరమైన పరిమితుల" కారణంగా తన పాత్రకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నానని ఆమె తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ రాజీనామాను మార్చి 7 నుంచి వర్తించేలా ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.18లో స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
అయితే, ఉన్నతాధికారులతో సరైన సమన్వయం లేకపోవడం, తన ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోవడం వంటి కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం వంటి బాధ్యతల కోసం 2025 జనవరిలో ప్రభుత్వం సీతా శర్మను రెండేళ్ల కాలపరిమితితో నియమించింది. ఏడాదికి పైగా పనిచేసిన ఆమె, పదవీకాలం ముగియకముందే వైదొలిగారు.