'ఎఫ్ 2' దర్శకుడు అనిల్ రావిపూడి పు'కారు' కథ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎఫ్ 2' దర్శకుడు అనిల్ రావిపూడి పు'కారు' కథ!

  • భారీ లాభాలు తెస్తోన్న 'ఎఫ్ 2'
  • అనిల్ రావిపూడికి కారు గిఫ్ట్ అంటూ వార్తలు
  • నిజమైతే బాగుండునన్న దర్శకుడు  
దిల్ రాజు నిర్మాణంలో .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ, భారీ వసూళ్లను రాబడుతోంది. నిర్మాతగా దిల్ రాజుకి భారీగా లాభాలు రావడంతో, దర్శకుడు అనిల్ రావిపూడికి ఆయన ఖరీదైన బీఎండబ్ల్యు కారును గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త షికారు చేసింది.

గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులకి నిర్మాతలు ఇలా ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం వలన, ఈ వార్త కూడా నిజమేనని అంతా అనుకున్నారు. కానీ దిల్ రాజు .. అనిల్ రావిపూడికి కారును కానుకగా ఇచ్చాడనే వార్తలో మాత్రం నిజం లేదట. ఈ వార్తను గురించి సన్నిహితులు అనిల్ రావిపూడి దృష్టికి తీసుకెళితే, 'వినడానికి చాలా బావుంది .. ఈ వార్తను దిల్ రాజు నిజం చేసేస్తే ఓ పనైపోతుంది' అంటూ నవ్వేశాడట. అనిల్ రావిపూడి అన్నట్టుగా దిల్ రాజు ఈ వార్తను నిజం చేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు.
anil arvipudi

More Telugu News