దేశానికి మళ్లీ నేనే ప్రధాని: మోదీ
- కాంగ్రెస్ పాలనలో జమ్ముకశ్మీర్ నిరాదరణకు గురైంది
- బీజేపీ పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది
- విభజన రాజకీయాలను పారదోలాం
ఈ ఐదేళ్ల పాలనలో విభజన రాజకీయాలను, లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని పారదోలామని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఆలస్యం లేకుండా వేగంగా అందజేసే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. మొదటి విడత సాయంగా ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ. 2 వేలు అందిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు.