కశ్మీర్ లోకి చొరబడ్డ జైషే ఉగ్రవాదులు.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- పుల్వామాలోని రాజ్ పొరాలో ఎన్ కౌంటర్
- కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలు
- తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం
దీంతో రంగంలోకి దిగిన బలగాలు.. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే భద్రతా బలగాలు తమను చుట్టుముట్టినట్టు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
ఈరోజు ఉదయం వరకూ సాగిన ఈ ఎన్ కౌంటర్ లో జైషేకు చెందిన షాహిద్ అహ్మాద్, అనియత్ అహ్మద్ లు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనాస్థలం నుంచి ఎస్ఎల్ఆర్, పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.