హరీశ్ రావు సంచలన నిర్ణయం.. టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా
- టీఎంయూ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న హరీశ్
- ఉద్యమంలో కార్మికులను ముందుండి నడిపించిన నేత
- హఠాత్తు నిర్ణయంపై కార్మికుల్లో చర్చలు
ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపించడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన తన రాజీనామాను ప్రకటించడం కార్మికుల్లో చర్చనీయాంశమైంది. త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. దానికీ, హరీశ్ రాజీనామాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.