'ఖలీ' కీలక పాత్రగా జయంత్.సి పరాన్జీ చిత్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఖలీ' కీలక పాత్రగా జయంత్.సి పరాన్జీ చిత్రం

  • గతంలో స్టార్ హీరోలతో సినిమాలు
  • వరుసగా అందుకున్న భారీ విజయాలు
  • తాజా చిత్రంగా 'నరేంద్ర'    
దర్శకుడు జయంత్. సి పరాన్జీ పేరు వినగానే 'ప్రేమించుకుందాం రా' .. 'బావగారు బాగున్నారా' .. 'ప్రేమంటే ఇదేరా'.. 'లక్ష్మీ నరసింహా' వంటి భారీ హిట్ చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాంటి జయంత్ తాజాగా 'నరేంద్ర' అనే ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. ఇషాన్ ఎంటర్టైమెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాయకా నాయికలుగా నీలేశ్ ఏటి .. ఇజబెల్లె నటిస్తున్నారు.బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, 'డబ్ల్యు డబ్ల్యు ఈ' స్టార్ 'ఖలీ' ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించిన ఆయన, ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ సంపత్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన జయంత్ .. కొత్త వాళ్లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చేస్తోన్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
nilesh
izabelle

More Telugu News