‘Seetharama Kalyana: సినిమాకు వెళ్లేందుకు సెలవు కోరిన ఆర్టీసీ డ్రైవర్.. నిజాయతీకి మెచ్చి సెలవు మంజూరు

సినిమాకు వెళ్లేందుకు విధులకు డుమ్మా కొట్టాలంటే ఎవరైనా కుంటి సాకులు చెప్పి సెలవు సంపాదించుకుంటారు. కానీ కర్ణాటక ఆర్టీసీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ నిజాయతీగా సినిమాకు వెళ్లేందుకు సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. కుటుంబంతో కలిసి తాజాగా విడుదలైన ‘సీతారామ కల్యాణం’ సినిమాకు వెళ్లాలనుకుంటున్నానని, తనకు సెలవు కావాలని సెలవు చీటీలో పేర్కొన్నాడు.

కృష్ణరాజనగర్ బస్ డిపోలో డ్రైవర్ కమ్ కండక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్ పెట్టుకున్న సెలవు దరఖాస్తు చూసి డిపో మేనేజర్ తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత అతడి నిజాయతీకి మెచ్చి సెలవు మంజూరు చేశారు. రాజేశ్ తన సెలవు చీటీలో.. తాను సీతారామ కల్యాణం సినిమాకు వెళ్లాలనుకుంటున్నానని, ఈ సినిమాలోని హీరో నిఖిల్ గౌడ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడని, వారు తమ జిల్లా వారే కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నాడు.  

డిపో మేనేజర్ సెలవు మంజూరు చేయడంతో రాజేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. నేడు (సోమవారం) కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లనున్నట్టు తెలిపాడు. కాగా, భర్త రాసిన సెలవు చీటీని  భార్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
‘Seetharama Kalyana
Nikhil gowda
Karnataka
KSRTC

More Telugu News